- మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణా మిల్లర్
- తొలిసారే చరిత్ర సృష్టించిన పియా
- సరితా కోమటిరెడ్డి, వివేక్ రామస్వామికి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం ఐదుగురు ఇండో -అమెరికన్లు హౌస్ స్థానాలను గెలుచుకోగా, మేరీల్యాండ్ డిప్యూటీ గవర్నర్ (లెఫ్టినెంట్ గవర్నర్) అరుణా మిల్లర్ మళ్లీ ఎన్నికయ్యారు.
డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అమీ బెరా, సుహాస్ సుబ్రమణ్యం, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ ప్రజాప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికవ్వగా, తొలిసారి బరిలోకి దిగిన పియా దాండియా విజయం సాధించారు. ఎన్నికైన కొత్త కాంగ్రెస్ ప్రతినిధులు2027 జనవరి 3 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమీ బెరా: కాలిఫోర్నియా 3వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి రాబ్ టక్కర్‌పై విజయం సాధించి, వరుసగా 8వ సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
రో ఖన్నా: కాలిఫోర్నియా 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి 6వ పర్యాయం గెలుపొందారు.
సుహాస్ సుబ్రమణ్యం: వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై 61 శాతానికి పైగా ఓట్లతో గెలిచి రెండోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.
ప్రమీలా జయపాల్: వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆరోసారి గెలుపొందారు. చెన్నైలో జన్మించిన ప్రమీల, 2016లో తొలిసారి ఎన్నికయ్యారు.
పియా దాండియా: ఫ్లోరిడా 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కార్‌పై విజయం సాధించి తొలిసారి కొత్తగా సభలో అడుగుపెడుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన అరుణా మిల్లర్.. గవర్నర్ వెస్ మోర్‌తో కలిసి మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రెండోసారి గెలుపొందారు.
సరితా కోమటిరెడ్డి పరాజయం
ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం పోటీపడిన సరితా కోమటిరెడ్డి (తెలంగాణ మూలాలు) ఓడిపోయారు. మరో రిపబ్లికన్ వివేక్ రామస్వామి అమీ యాక్టన్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఓహియో గవర్నర్ రేస్ నుంచి ఆయన తప్పుకున్నారు.
