రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్ లో హైదరాబాద్‌‌‌‌ లక్ష్యం 259

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్ లో హైదరాబాద్‌‌‌‌ లక్ష్యం 259

సికింద్రాబాద్‌‌‌‌, వెలుగు: రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌.. హైదరాబాద్‌‌‌‌ ముందు 259 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 4.5 ఓవర్లలో 13/2 స్కోరు చేసింది. 

తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (0), రుతిక్‌‌‌‌ మెండె (0) డకౌట్లు కాగా, అభిరత్‌‌‌‌ రెడ్డి (8 బ్యాటింగ్‌‌‌‌), రాహుల్‌‌‌‌ రాధేశ్‌‌‌‌ (3 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. దేవ్‌‌‌‌ ఆదిత్య 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌ గెలవాలంటే 246 రన్స్‌‌‌‌ చేయాలి. 

అంతకుముందు 275/9 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 86.1 ఓవర్లలో 280 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ధర్మేంద్రసిన్హ్‌‌‌‌ జడేజా 5 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ ప్రారంభించిన చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ 68.4 ఓవర్లలో 254 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. మయాంక్‌‌‌‌ వర్మ (81), సంజీత్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ (51) హాఫ్ సెంచరీలు చేశారు. రక్షణ్‌‌‌‌ రెడ్డి, అనికేత్‌‌‌‌ రెడ్డి చెరో మూడు వికెట్లు తీశారు.