‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ సందీప్ సరోజ్, కేయురి జంటగా ప్రతాప్ కొల్లారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘#బాలుగీత’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ కో ప్రొడ్యూసర్స్. గురువారం నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘కమిటీ కుర్రోళ్లు’లో చేసిన యాక్టర్స్ నటించిన ఇతర సినిమాల ఈవెంట్స్‌కు రావడం నాకెప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే శేఖర్ కమ్ముల గారి సినిమాలా అనిపించింది.
టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ ‘అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. చాలా యంగ్ టాలెంట్‌తో చేసిన సినిమా ఇది. మనసుపెట్టి తీశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయదు’ అని అన్నారు. పెళ్లి తర్వాత మొదలయ్యే ఈ ప్రేమకథ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందని, సినిమా చూశాక ఒక తోడు ఉంటే బాగుంటుందని ఫీలింగ్ కలుగుతుందని హీరో సందీప్ సరోజ్ చెప్పాడు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న జంట తాలూకు ప్రేమకథ ఇదని, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు రిలేట్ అయ్యేలా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. హీరోయిన్ కేయురి, కో ప్రొడ్యూసర్ హరీష్, ఈటీవీ కంటెంట్ హెడ్ భరణ్ తదితరులు పాల్గొన్నారు.
