- 4 వేల మెగావాట్ల విద్యుత్ఉత్పత్తికి అన్ని చర్యలు తీసుకోవాలి
- ప్లాంట్ ఇంజినీర్లను ఆదేశించిన జెన్ కో సీఎండీ హరీశ్
హైదరాబాద్, వెలుగు: నవంబర్ నెలాఖరులోగా వైటీపీఎస్‌లోని పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్రతీ రోజు ప్లాంట్నడింపించాలని జెన్ కో ఇంజినీర్లను సీఎండీ హరీశ్ఆదేశించారు. బుధవారం భేల్కంపెనీ పవర్ డైరెక్టర్ తజీందర్ గుప్తాతో కలిసి వైటీపీఎస్ను సందర్శించిన సీఎండీ అక్కడే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ఇటీవల వైటీపీఎస్ ప్లాంట్‌ను పరిశీలించి ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌పై ఆయన సమీక్షించారు.
భేల్ కంపెనీ చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. రైల్వే రేక్ అన్‌లోడింగ్, టర్న్ అరౌండ్ టైమ్, దాన్ని మెరుగుపరిచే మార్గాలపై ఇంజినీర్ల అభిప్రాయాలను అడిగారు. నాలుగు యూనిట్లు పూర్తి పవర్ జనరేషన్ ఇస్తున్నాయా? లేదంటే జనరేషన్ లాస్ కారణాలేమిటో వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) కి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యాగన్ టిప్లర్లు, క్రషర్ హౌస్ పనితీరును విశ్లేషించారు. 800 మెగావాట్ల సామర్థ్యం గల 5వ యూనిట్‌ను ఇటీవల సింక్రనైజ్ చేసి విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించగా ఆ యూనిట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
