ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ రిమ్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగు వెంటిలేటర్ల చోరీ

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ రిమ్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగు వెంటిలేటర్ల చోరీ
  • టెక్నీషియన్లుగా వచ్చి ఎత్తుకెళ్లిన దుండగులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.. పోలీసులకు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌ జనరల్‌‌ ఆసుపత్రిలో రూ.30 లక్షల విలువైన నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయి. టెక్నీషియన్లుగా వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ఎత్తుకెళ్లారు. గత నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రిమ్స్‌‌ డైరెక్టర్‌‌ జైసింగ్‌‌ రాథోడ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెల 30న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లుగా ఆసుపత్రిలోకి వచ్చారు. రిమ్స్‌‌ రెండో అంతస్తులోని ఆర్‌‌ఐసీయూ నుంచి రెండు, టీబీ వార్డు నుంచి మరో రెండు వెంటిలేటర్లను తీసుకెళ్లారు. అనంతరం బైక్‌‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డైరెక్టర్‌‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.