ఏసీబీ వలలో బజార్ హత్నూర్ ఎస్సై..రూ.40 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

ఏసీబీ వలలో  బజార్ హత్నూర్ ఎస్సై..రూ.40 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

బజార్​హత్నూర్​, వెలుగు :  ఆదిలాబాద్​జిల్లాలో ఓ అవినీతి ఎస్సై ఏసీబీ వలకు చిక్కిన ఘటన బజార్​హత్నూర్​ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  బజార్​హత్నూర్​ పోలీస్​ స్టేషన్​ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎల్.రమేశ్​ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన బాధితుడిని రోడ్డు ప్రమాద కేసు నుంచి తప్పించేందుకు రూ.40 వేలు డిమాండ్​ చేశాడు. కాగా, బుధవారం పోలీస్​ స్టేషన్​ పరిసరాల్లో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి నగదుతో పాటు ఆయనను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.