నిర్మల్, వెలుగు : బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) పరిపాలనా భవనంలో ‘క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అప్లి కేషన్స్’ అనే అంశంపై మూడు రోజుల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం (ఎఫ్ డీపీ) ప్రారంభమైంది.
ఈనెల 4 నుంచి 6 వరకు జరిగే ఈ కార్యక్రమానికి ఐఐటీఎమ్ సి-డాట్ సంజ్ఞా టెక్నాలజీస్ ఫౌండేషన్ సహకారం అందించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బుధవారం సదస్సుకు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, సంజ్ఞా టెక్నాలజీస్ సీఈఓ డాక్టర్ రవీంద్ర బార్లింగే (ఆన్‌లైన్‌లో), క్యూక్లై ర్‌వా యన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) సాయి శంకర్.పి, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బి. శ్రీనివాస్ హాజరయ్యారు.
కార్యక్రమ లక్ష్యాలను ఎఫ్‌డీపీ కోఆర్డి నేటర్ డాక్టర్ కె. మహేశ్వివరిస్తూ, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటింగ్ రంగాల్లో క్వాంటమ్ సాంకేతికత చాలా కీలకమని చెప్పారు. సంజ్ఞా టెక్నాలజీస్ సీఈఓ డాక్టర్ రవీంద్ర బార్లింగే మాట్లాడుతూ, ఆర్‌జీయూకేటీ బాసర విద్యార్థులు, అధ్యాపకులకు ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్, పరిశోధన నిధులు అందించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
క్యూక్లైర్ వాయన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ డైరెక్టర్ కల్నల్ సాయి శం కర్.పి రూ.40 లక్షల విలువైన 40 క్వాంటమ్ సాఫ్ట్‌వేర్ లైసెన్సులను ఉచితంగా విశ్వవిద్యాలయానికి ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులకు వేత నంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ఈ చొరవను మెచ్చుకుంటూ, నూతన సాంకేతికతలను నేర్చుకుని ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకో వాలని విద్యార్థులను కోరారు.
