పుల్లారెడ్డి స్వీట్స్‌‌‌‌‌‌‌‌ లో మళ్లీ తనిఖీలు చేయండి..లైసెన్స్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ

పుల్లారెడ్డి స్వీట్స్‌‌‌‌‌‌‌‌ లో మళ్లీ తనిఖీలు చేయండి..లైసెన్స్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేతకు  హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: పుల్లారెడ్డి స్వీట్స్‌‌‌‌‌‌‌‌ సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌లో ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారో లేదో మరోసారి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. లైసెన్స్‌‌‌‌‌‌‌‌ పై విధించిన సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ యాజమాన్యం బుధవారం లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌.వి. శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది రఘు వాదిస్తూ.. తనిఖీల్లో గుర్తించిన లోపభూయిష్టమైన పదార్థాలను విక్రయ కేంద్రాలకు పంపడం లేదని, భవిష్యత్తులోనూ వినియోగించబోమని తెలిపారు. 

లోపాలపై గత నెల 30న అధికారులకు వివరణ ఇచ్చామని, దీపావళి పండుగ నేపథ్యంలో లైసెన్స్‌‌‌‌‌‌‌‌ సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది పి. శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ నిబంధనల ప్రకారం ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆహార భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. లోపాలను సరిచేశామంటూ యాజమాన్యం ఇచ్చిన వివరణ మేరకు మరోసారి తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.