వారంలో 5 రోజుల డ్యూటీని అమలు చేయండి : జేఏసీ

వారంలో 5 రోజుల డ్యూటీని అమలు చేయండి : జేఏసీ
  • 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించండి
  • మంత్రి శ్రీధర్ బాబును కోరిన ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు కోరారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం  కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నారు.

బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబును జేఏసీ నేతలు ముజీబ్, శ్యామ్, కస్తూరి వెంకట్, సత్యనారాయణగౌడ్, శ్రీకాంత్ తో మంత్రిని కలిశారు. 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంత్రిని కోరారు. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు కల్పించాలని కోరారు. ఈహెచ్ ఎస్ అమలుపై చొరవ చూపాలన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించాలన్నారు. జేఏసీ వినతులపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూల స్పందించారని నేతలు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.