హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పీఆర్సీ– 2026 వేతన సవరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు 2.54 శాతం కరువు భత్యం (డీఏ) పెంచడంతో ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, 1104 అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ వజీర్, సదానందం పాల్గొన్నారు.
