విజయ్ రాజ్‌కుమార్, ‘KGF’ ఫేమ్ అర్చన జోయిస్ జంటగా కొత్త సినిమా ప్రారంభం

విజయ్ రాజ్‌కుమార్, ‘KGF’ ఫేమ్ అర్చన జోయిస్ జంటగా కొత్త సినిమా ప్రారంభం

‘డెలులు’ ఫేమ్ విజయ్ రాజ్ కుమార్ హీరోగా, ‘కేజీఎఫ్‌‌’లో యశ్‌‌కు తల్లిగా నటించిన అర్చనా జోయస్‌‌ హీరోయిన్‌‌గా  ఓ సినిమా రూపొందుతోంది.  అతిథి మైకల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.  దివాకర్ యడ్ల దర్శకత్వంలో కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై ఎన్.ఎన్. కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. దర్శకుడు వీవీ వినాయక్‌‌,  హీరో ఆది సాయికుమార్ అతిథులుగా హాజరై టీమ్‌‌కు బెస్ట్ బెస్ట్ విషెస్ చెప్పారు. 

మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ అతిథులుగా హాజరై అభినందనలు తెలియజేశారు.  అందమైన ప్రేమకథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు చెప్పాడు.  హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్టు నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ తెలియజేశారు.