వాషింగ్టన్: భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్‌తో పాటు మరో ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతరిక్షంలో ఈ ఓటింగ్ ప్రక్రియంతా డిజిటల్ పద్ధతిలోనే సాగింది. వ్యోమగాములకు అక్కడి లాప్‌టాప్‌ల ద్వారా సురక్షితమైన ఎలక్ట్రానిక్ బ్యాలెట్ అందుబాటులో ఉంచుతారు.
దానిని నింపి నాసాకు చెందిన ప్రత్యేక కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ద్వారా భూమిపై ఉన్న ఎన్నికల అధికారులకు సురక్షితంగా పంపుతారు. ఈ అరుదైన ఓటింగ్ అనుభవానికి సంబంధించిన వీడియోను అనిల్ మీనన్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
