ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్ షాక్.. కాంగ్రెస్ ఉభయ సభలూ డెమోక్రాట్ల వశం

ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్మ్ షాక్.. కాంగ్రెస్ ఉభయ సభలూ డెమోక్రాట్ల వశం
  • సెనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడు సీట్లు ఫ్లిప్.. హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లూ వేవ్
  • కాన్సాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1932 తర్వాత తొలిసారి డెమోక్రాట్ సెనేటర్
  • టెక్సస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు దశాబ్దాల తర్వాత బ్లూ ఫ్లాగ్
  • ధరల భారం, ఇరాన్ యుద్ధంపై ఓటర్ల ఆగ్రహం
  • అమెరికన్లు యుద్ధం వద్దంటున్నరు: ఇరాన్​

వాషింగ్టన్ డీసీ: అమెరికా మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ ఉభయ సభలైన ప్రతినిధుల సభ (హౌస్), సెనేట్ రెండింటినీ కైవసం చేసుకుంది. ఈ రెండు సభలూ ఇప్పటివరకు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉండగా, వచ్చే జనవరి నుంచి డెమోక్రాట్ల చేతికి వెళ్లనున్నాయి.

సెనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 54 సీట్లను డెమోక్రాట్లు గెలుచుకున్నారని అమెరికన్ మీడియా ప్రకటించింది. హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 249 సీట్లు దక్కించుకున్నారని వెల్లడించింది. రెండో దఫా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ పాలనకు ఇది ఓటర్ల తిరస్కారమని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక పార్టీ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్మ్ ఎన్నికల్లో హౌస్, సెనేట్​నూ ఒకేసారి చేజిక్కించుకోవడం ఇది ఐదోసారి మాత్రమే.

సెనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడు సీట్లు ఫ్లిప్..
డెమోక్రాట్లకు సెనేట్ దక్కడం కష్టమని ఎన్నికల ముందు విశ్లేషకులు అంచనా వేశారు. ఎన్నికలు జరిగిన 35 సీట్లలో 22 రిపబ్లికన్లవే కావడంతో మ్యాప్ వారికే అనుకూలమని భావించారు. కానీ డెమోక్రాట్లు ఒహాయో, అయోవా, సౌత్ కరోలినా, మెయిన్, నార్త్ కరోలినా, కాన్సాస్, టెక్సస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రిపబ్లికన్ల సీట్లను గెలుచుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల (అమెరికా తూర్పు కాలమానం) నాటికి సెనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెమోక్రాట్లు 54, రిపబ్లికన్లు 44 సీట్లు గెలుచుకున్నారు.

బ్యాలెట్‌‌‌‌‌‌‌‌పై నా పేరు ఉంటే గెలిచేటోళ్లం 
బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నా పేరు లేదు. ఒక వేళ ఉంటే మాత్రం రిపబ్లికన్లు భారీ మెజార్టీతో విజయం సాధించేవారు. డెమోక్రాట్లకు నా శుభాకాంక్షలు. దేశ సంక్షేమం కోసం వారితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నా. నాకు వీటో అధికారం ఉందనే విషయం వారికి తెలుసు. ప్రతి బిల్లును నేను వీటో చేస్తూ పోతే వారు తట్టుకోలేరు. అందుకే వారే నా వద్దకు వచ్చి కలిసి పనిచేస్తారని భావిస్తున్నా.

కొన్ని చోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెమొక్రాట్లు కనీసం 250 సీట్లు సాధిస్తారని ఎంఎస్ నౌ చానల్ అంచనా వేసింది. ‘అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ డెమొక్రాట్లం సెనేట్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాం’ అని సెనేట్‌‌‌‌‌‌‌‌లో డెమొక్రాట్ల నేత చక్ షూమర్ అన్నారు.

ఓటమికి కారణాలేంటి?
పెరిగిన ధరలే ఈ ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. జీవన వ్యయం తమ ఓటును నిర్ణయించిన ప్రధాన అంశమని 89 శాతం మంది ఓటర్లు చెప్పారని సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి, ఇంధన ధరలు ఏడాదిలో 34 శాతానికి పైగా ఎగబాకాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌లు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచాయి.

ఎన్నికల నాటికి ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 38 శాతానికి పడిపోయింది. మిడ్‌‌‌‌‌‌‌‌టర్మ్ ఎన్నికల సమయంలో ఒక అధ్యక్షుడికి ఇది చారిత్రకంగా తక్కువ స్థాయి. రిపబ్లికన్ రాష్ట్రాల్లో హౌస్ నియోజకవర్గాల సరిహద్దులను మార్చి ముందస్తు లబ్ధి పొందాలని రిపబ్లికన్లు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని సీఎన్ఎన్ విశ్లేషించింది.

ట్రంప్‌‌‌‌‌‌‌‌కు ముందున్న సవాళ్లు
కాంగ్రెస్ డెమొక్రాట్ల చేతికి వెళ్లడంతో ట్రంప్ చివరి రెండేండ్ల పాలన మరింత కఠినంగా మారనుంది. ఆయన ప్రతిపాదించే బిల్లులకు హౌస్‌‌‌‌‌‌‌‌లో అడ్డుకట్ట పడనుంది. కేబినెట్ నియామకాలు, ఫెడరల్ జడ్జీల నియామకాలను ఆమోదించే అధికారం ఉన్న సెనేట్ కూడా డెమొక్రాట్ల చేతిలోనే ఉండటం ఆయనకు పెద్ద ప్రతిబంధకం. ట్రంప్ ప్రభుత్వంపై దర్యాప్తులు, సమన్లు జారీ చేసేందుకు డెమొక్రాట్లకు అవకాశం దక్కనుంది. ఆయనపై అభిశంసన ప్రయత్నం కూడా జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

చరిత్ర సృష్టించిన విజేతలు
ఈ ఎన్నికల్లో పలువురు చరిత్ర సృష్టించారు. జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్ అమెరికా చరిత్రలో గవర్నర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా నిలిచారు. మిషిగన్‌‌‌‌‌‌‌‌లో గెలిచిన అబ్దుల్ ఎల్–సయ్యద్ సెనేట్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టనున్న తొలి ముస్లింగా రికార్డుకెక్కనున్నారు. టెక్సస్‌‌‌‌‌‌‌‌కు తొలి లాటినా గవర్నర్‌‌‌‌‌‌‌‌గా హినోజోసా, ఫ్లోరిడాలో రిపబ్లికన్ బైరన్ డొనాల్డ్స్ ఆ రాష్ట్ర తొలి నల్లజాతి గవర్నర్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు.

రిపబ్లికన్ కంచుకోటల్లో పాగా
దశాబ్దాలుగా రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ డెమొక్రాట్లు జెండా ఎగరేశారు. కాన్సాస్‌‌‌‌‌‌‌‌లో పాస్టర్ ఆడమ్ హామిల్టన్ సిట్టింగ్ రిపబ్లికన్ సెనేటర్ రోజర్ మార్షల్‌‌‌‌‌‌‌‌ను ఓడించి, 1932 తర్వాత ఆ రాష్ట్రం నుంచి సెనేట్‌‌‌‌‌‌‌‌కు ఎన్నికైన తొలి డెమొక్రాట్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు.

టెక్సస్‌‌‌‌‌‌‌‌లో జేమ్స్ టాలరికో సెనేట్ స్థానాన్ని, గినా హినోజోసా గవర్నర్ పదవి గెలుచుకున్నారు. 3 దశాబ్దాల తర్వాత టెక్సస్‌‌‌‌‌‌‌‌లో డెమొక్రాట్లు రాష్ట్రస్థాయి పదవులు గెలవడం ఇదే తొలిసారి. మెయిన్‌‌‌‌‌‌‌‌లో రిపబ్లికన్ సెనేటర్ సూసన్ కాలిన్స్ ఓటమిని అంగీకరించారు.

మిడ్ టర్మ్ ఫలితాలపై ఇరాన్ స్పీకర్ వ్యాఖ్య
టెహ్రాన్: అమెరికా మిడ్‌‌‌‌టర్మ్ ఎన్నికల ఫలితాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఘాలిబాఫ్ స్పందించారు. అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆత్మసాక్షి కానీ జీవన వ్యయం కానీ అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఈ సందేశాన్ని మేమూ సమర్థిస్తున్నాం. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ శక్తులను సేవించేందుకు ప్రజా సంకల్పానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మా ప్రతిస్పందన పీడకలలా మిమ్మల్ని వెంటాడుతుంది’’ అని ఘాలిబాఫ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.