50 వేల టెలికం టవర్లను నిర్మించిన ఇండస్

50 వేల టెలికం టవర్లను నిర్మించిన ఇండస్

హైదరాబాద్​, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం టవర్ మౌలిక సదుపాయాల సంస్థల్లో ఒకటైన ఇండస్ టవర్స్ అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా 50వేల సౌర శక్తి ఆధారిత టెలికం సైట్లను విజయవంతంగా ఏర్పాటు చేసి గ్లోబల్ రికార్డు సృష్టించింది. దాదాపు 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసింది. దీనివల్ల ఏటా 4.20 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. 

పర్యావరణపరంగా చూస్తే ఇది సుమారు రెండు కోట్ల చెట్లను నాటడంతో సమానం. ఈ సోలార్ సైట్లను డిజిటల్ పద్ధతిలో అనుసంధానించడం వల్ల రియల్ టైమ్‌‌‌‌లో విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ సౌర శక్తి టవర్ల సంఖ్యను లక్షకు పెంచాలని ఇండస్ టవర్స్ లక్ష్యంగా పెట్టుకుంది.