అమెరికా 2026 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా బిలియనీర్ ఎలన్ మస్క్ సుమారు అర బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 4 వేల700 కోట్లు ఖర్చు చేశారు. ట్రంప్ అధికారాన్ని నిలబెట్టేందుకు, టెక్సాస్‌ను రిపబ్లికన్ ఆధీనంలో ఉంచేందుకు భారీగా స్పాన్సర్ చేశారు. కానీ రిపబ్లికన్లు ఘోర పరాజయం పాలైన తర్వాత మస్క్ రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తిగా మిగిలారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
టెస్లా సీఈవో అయిన మస్క్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి కూడా కోట్లాది డాలర్లు ఖర్చు చేశారు. ఈసారి ఎన్నికల్లో డెమొక్రాట్లు కాంగ్రెస్ రెండు సభల్లోనూ అధికారం సాధించారు. టెక్సాస్‌లో 30 ఏళ్ల తర్వాత మొదటిసారి డెమొక్రాట్ అభ్యర్థి గవర్నర్ గా ఎన్నికకావడం ఊహించని పరిణామం.
డెమొక్రాట్లు గెలిస్తే మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై విచారణలు చేపడతారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎక్స్ స్పందించారు మస్క్. కత్తితో జీవించేవాడు కత్తితోనే పోతాడు. నాతో యుద్ధం పెట్టుకునేవారు అర్థం చేసుకోవాలి – నేను బ్యాగ్రౌండ్లో ఉన్న వాస్తవ శక్తులెవరో కనుక్కుని వారిపైనే దాడి చేస్తాను. వారి బొమ్మలపై కాదు అంటూ హెచ్చరిస్తున్నట్లుగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మస్క్ బెదిరింపు ట్వీట్లపై డెమొక్రాట్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు డెమొక్రాట్లు మస్క్‌పై గతంలోనూ వివాదాలు లేవనెత్తారు. ఉక్రెయిన్ సైనిక శాటిలైట్ కమ్యూనికేషన్స్‌పై ఆంక్షలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీలో భారీ ఉద్యోగుల కోతలు, ఆయన కంపెనీలకు వచ్చే ప్రభుత్వ కాంట్రాక్టులు, సబ్సిడీలు వంటి అంశాలపై నిలదీశారు. మున్ముందు మస్క్ విచారణలు ఎదుర్కోక తప్పదని అంటున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత టెస్లా, స్పేస్‌ఎక్స్ షేర్లు కూడా పతనం కావడం గమనార్హం.
Live by the sword, die by the sword. Those who pick fights with me should understand that I will find out who is really pulling the strings and come for them, not just their puppets …
— Elon Musk (@elonmusk) October 21, 2026
