హైదరాబాద్, వెలుగు:ఇంజినీరింగ్ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ మోల్డ్ టెక్ సెప్టెంబర్ త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక లాభాలను నమోదు చేసింది. ఆదాయం 51.2 శాతం పెరిగి రూ.60.81 కోట్లకు చేరుకుంది. నికర లాభం 197.32 శాతం వృద్ధితో రూ.9.62 కోట్లకు ఎగబాకింది.
గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన పూర్తి లాభంతో ఈ ఒక్క త్రైమాసికం లాభం సమానం కావడం విశేషం. ఇబిటా సైతం 144.5 శాతం పెరిగి రూ.14.58 కోట్లకు చేరుకుంది. ఈపీఎస్ గత ఏడాదితో పోలిస్తే రూ.0.56 నుంచి రూ.1.67కు పెరిగింది. సివిల్, స్ట్రక్చరల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కొత్త ప్రాజెక్టులు రావడం, వ్యాపార విస్తరణ వ్యూహాలు అద్భుతంగా పని చేయడమే ఈ భారీ లాభాలకు కారణమని సంస్థ వెల్లడించింది.
