రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి బ్రాండ్ల పేరుతో అమ్మకం..రంగారెడ్డి జిల్లా మంచాల మిల్లులో 100 క్వింటాళ్ళ రైస్ సీజ్

రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి బ్రాండ్ల పేరుతో అమ్మకం..రంగారెడ్డి జిల్లా మంచాల మిల్లులో  100 క్వింటాళ్ళ రైస్ సీజ్

ఇబ్రహీంపట్నం, వెలుగు:  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల మండలంలోని పలు రైస్​ మిల్లుల్లో బుధవారం విజిలెన్స్ ఆండ్​ఎన్​ఫోర్స్​మెంట్, సివిల్ సప్లయీస్​, తూనికలు, కొలతల శాఖల అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ రైస్​ మిల్లులో అనుమతులు లేని కాంటాపై తూకం వేస్తుండడంతో కేసు నమోదు చేశారు. 

మంచాలలోని రాఘవేంద్ర రైస్​మిల్లులో 100 క్వింటాళ్ళ రేషన్​బియ్యం ఉండడంతో సీజ్ చేశారు. రేషన్​బియ్యాన్నే పాలిష్​ చేసి 28 రకాల వేర్వేరు బ్రాండ్ల బ్యాగుల్లో ప్యాక్​ చేస్తుండడంతో సీజ్​ చేశారు. విజిలెన్స్ ఆండ్​ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ రాంకుమార్​, డీసీఎస్​వో వనజాత, తూనికలు, కొలతల శాఖ అధికారి సుధాకర్​ తధితరులు పాల్గొన్నారు.