Renu Desai: పవన్ కోసంస్పెషల్ ప్యాంట్ తెప్పించిన రేణు దేశాయ్.. ప్రపంచంలో 5 ఉన్నాయ్.. రేటు ఎంతంటే?

Renu Desai: పవన్ కోసంస్పెషల్ ప్యాంట్ తెప్పించిన రేణు దేశాయ్.. ప్రపంచంలో 5 ఉన్నాయ్.. రేటు ఎంతంటే?

టాలీవుడ్ పవర్ స్టార పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసే ప్రతి పని, ధరించే ప్రతి కాస్ట్యూమ్ అప్పట్లోనే ఓ ట్రెండ్ గా మారిపోయేది. ముఖ్యంగా పవన్ నటించిన ' బాలు '  మూవీలో ఆయన ధరించిన కార్గో ప్యాంట్ అప్పటి యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ ప్యాంట్ వెనుక ఉన్న అసలు కథను లేటెస్ట్ గాఆయన మాజీ భార్య,  నటి  రేణు దేశాయ్ బయటపెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ .. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ కోసం అప్పట్లో తాను పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. 'బాలు' చిత్రంలో పవన్ ధరించిన ప్రత్యేకమైన కార్గో ప్యాంట్ ఖరీదు అప్పట్లోనే ఏకంగా రూ.75 వేలు అని వెల్లడించారు. ఇటలీలోని మిలన్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ప్యాంట్‌ను రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒరిజినల్ ఆర్మీ క్లాత్‌తో రూపొందించారట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే తయారయ్యాయని ఆమె తెలిపారు. వాటిలో ఒకదాన్ని ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా, మరొకటి పవన్ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు.

అంతే కాదు ఈ ప్యాంట్ కోసం ముందుగానే అడ్వాన్స్ చెల్లించి, దాదాపు మూడు నెలలు ఎదురుచూసినట్లు రేణు వెల్లడించారు. సినిమా మొత్తం పవన్ ఒకే తరహా కాస్ట్యూమ్‌లో కనిపించే కంటిన్యూటీ ఉండటంతో పది సాధారణ ప్యాంట్లు కొనడం కంటే, ప్రత్యేకమైన ఒక్క ప్యాంట్‌పై పెట్టుబడి పెట్టడం మంచిదని నిర్మాతను ఒప్పించారట. మరోవైపు పవన్, షారుఖ్ ఖాన్ లండన్‌లో ఒకే చోట షాపింగ్ చేసేవారని, షారుఖ్ కోసం కరణ్ జోహార్ కూడా అక్కడికి వచ్చేవారని ఆమె చెప్పిన విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. జంతు సంరక్షణ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరిగా 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కనిపించారు. మొత్తానికి పాతికేళ్ల క్రితం పవన్ కోసం చేసిన ఆ కాస్ట్యూమ్ ప్రయోగం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.