అక్టోబర్ 15న విడుదలై థియేటర్లలో సందడి చేసిన రజినీకాంత్ ‘జైలర్-2’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ‘జైలర్-2’ సినిమా స్ట్రీమింగ్ ఉంటుందని అమెజాన్ ప్రైమ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED 🔥 #Jailer2OnPrime, Nov 12 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu https://t.co/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
‘‘TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED’’ అని ప్రైమ్ వీడియో ‘ఎక్స్’ ఖాతాలో అమెజాన్ పోస్ట్ చేసింది. థియేటర్ వెర్షన్ కాకుండా మరింత నిడివి ఉన్న వెర్షన్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి ‘జైలర్-2’ వచ్చేస్తుండటం గమనార్హం.
హిట్ టాక్ తెచ్చుకున్న స్టార్ హీరో సినిమాలు ఇలా నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వస్తుండటంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే.. ఓటీటీ సంస్థలతో సినీ నిర్మాణ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందంలో సినిమాను ఎప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలనే అంశం కూడా స్పష్టంగా ఉంటుంది.
ALSO READ : మాటలు లేకుండానే మ్యాజిక్ చేస్తున్న అనీష్.. ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్
సినీ నిర్మాణ సంస్థలు ఓటీటీ సంస్థల షరతులకు అంగీకరించాకే సదరు సినిమా హక్కులను ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ విషయాలపై అంతగా అవగాహన లేని అభిమానులు తమ హీరో సినిమా కలెక్షన్లకు సినీ నిర్మాణ సంస్థలు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, ఓటీటీ ఒప్పందాలు, సినీ నిర్మాణ సంస్థల స్వార్థాలు గండి కొడుతున్నాయని లబోదిబోమంటున్నారు.
