ఢిల్లీలో కుప్పకూలిన మూడు ఫ్లోర్ల బిల్డింగ్.. శిథిలాల కింద చిక్కుకున్న జనం

ఢిల్లీలో కుప్పకూలిన మూడు ఫ్లోర్ల బిల్డింగ్.. శిథిలాల కింద చిక్కుకున్న జనం

ఓల్డ్ ఢిల్లీలోని చావ్రి బజార్‌లో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో.. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారా దగ్గర ఉదయం 9.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

రెస్క్యూ టీంలు, ఆరు అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. పాత ఢిల్లీ ప్రాంతంలో దీపావళి కారణంగా పబ్లిక్తో చాందినీ చౌక్, చావ్రి బజార్ హోల్‌సేల్ మార్కెట్లు రద్దీగా ఉన్న సమయంలో ఈ బిల్డింగ్ కూలిపోవడం కలకలం రేపింది.

ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) ప్రకారం, భవనం కూలిపోయినట్లు ఉదయం 9:50 గంటల సమయంలో సమాచారం అందింది. ఈ ప్రదేశం చావ్రి బజార్ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉంది. సమాచారం అందిన వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. ఆ భవనం నిర్మాణంలో ఉందని అధికారులు తెలిపారు.

శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున, అదనపు అగ్నిమాపక వాహనాలను, అధికారులను కూడా ఘటనా స్థలానికి పంపించారు. గలీ షహతారాలోని షీష్ మహల్‌లో నిర్మాణంలో ఉన్న ఈ మూడు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.