ఫ్రెండ్స్, కొలీగ్స్ తో పార్టీలకు వెళుతుంటారా..? ఇవి గుర్తుంచుకోండి..!

ఫ్రెండ్స్, కొలీగ్స్ తో పార్టీలకు వెళుతుంటారా..? ఇవి గుర్తుంచుకోండి..!

ఫ్రెండ్స్, కొలీగ్స్, తెలిసినవాళ్ళు గెట్ టూగెదర్లకు పిలిస్తుంటారు. అలా వెళ్లినపుడు.. అందరితో కలిసి ఎంజాయ్ చేస్తాం. అయితే ఇలాంటి వేడుకల్లో ప్రత్యేకంగా ఉండాలన్నా.. నలుగురిలో కలిసిపోవాలన్నా.. ఇవి పాటించాల్సిందే.

ఆఫీస్ కొలిగ్స్ అంతా ఒక చోట కలిసినప్పుడు గాసిప్స్ మాట్లాడుకోవడం మామూలే. అలాంటప్పుడు వాటిలో భాగం కాకపోవడమే మంచిది. గాసిప్స్పై ఇంట్రెస్ట్ పెట్టకుండా, నెట్వర్క్ ని పెంచుకోవడానికి, వీలైతే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేయడం వల్ల మీపై మంచి అభిప్రాయం పడుతుంది. పార్టీకి పిలిచినవాళ్లు ఎంత దగ్గరివాళ్లైనా సరే, సాధ్యమైనంత వరకూ మీవెంట ఇంకో వ్యక్తిని తీసుకెళ్లకపోవడమే బెటర్. 

ఇలా చేయడంవల్ల ఎదుటివారు ఫీలవ్వడమే కాదు.. మీరు కూడా వాళ్లతోనే ఉండాల్సి వస్తుంది. దానివల్ల మీ చుట్టూ ఉన్నవారితో సరదాగా మాట్లాడే అవకాశం కూడా రాకపోవచ్చు. ఒకవేళ తప్పనిసరైతే పిలిచిన వారికి ముందే చెప్పి పర్మిషన్ తీసుకోండి.
మీరు వెళ్లేది ఆఫీసు పార్టీకైతే.. అక్కడ వీలైనంతవరకూ డిగ్నిఫైడ్ గా ఉండేలా చూసుకోవాలి. 

►ALSO READ | మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా..? లైఫ్ స్టైల్ లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..!

తోటి ఉద్యోగులు ఎంత దగ్గరైనా.. వీలైనంతవరకూ ఆఫీసు విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువగా జోకులు వేయడం లాంటివి చేయకండి.మీరు వెళ్లే పార్టీలో కొందరు మీకు తెలియకపోవచ్చు. అసలు కొంతమందితో మాట్లాడకపోవచ్చు. అయినా సరే మౌనంగా ఉండకుండా అందరితో కలిసిపోండి.