గిరిజన సంస్కృతి గొప్పది.. గుస్సాడీ వేడుకల్లో ట్రైనీ సివిల్ సర్వెంట్లు

గిరిజన సంస్కృతి గొప్పది.. గుస్సాడీ వేడుకల్లో ట్రైనీ సివిల్ సర్వెంట్లు
  •     నేరడిగొండ మండలంలో ముగిసిన ట్రైనీ సివిల్ సర్వెంట్ల పర్యటన

నేరడిగొండ, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారతే ధ్యేయమని, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ట్రైనీ సివిల్ సర్వెంట్లు అన్నారు. 

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో ఐదు రోజుల నుంచి కొనసాగిన ట్రైనీ సివిల్ సర్వెంట్ల శిక్షణా బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ట్రైనీ ఆఫీసర్లు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించి, గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, మహిళా సంఘాల ఆర్థిక పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, జీవన ప్రమాణాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఆఫీసర్ల పలకరింపు గ్రామస్తుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. 

అనంతరం గాజిలి గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవమైన గుస్సాడీ వేడుకల్లో ఆఫీసర్లు పాల్గొన్నారు. సంప్రదాయ తలపాగాలు ధరించి డప్పు చప్పుళ్లకు తగినట్లుగా గిరిజనులతో కలిసి అడుగులు వేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆఫీసర్లకు, గ్రామ ప్రజలకు ఉన్న దూరం తొలగిపోయి, బలమైన బంధం ఏర్పడిందని స్థానికులు కొనియాడారు. ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, ఆఫీసర్లు 
పాల్గొన్నారు.