Keerthy Suresh: 17 ఏళ్లకే ప్రేమ..పెళ్లి కోసం ఇంట్లో ఎన్నో కష్టాలు.. మతాంతర వివాహంపై కీర్తి సురేశ్ క్లారిటీ!

Keerthy Suresh: 17 ఏళ్లకే ప్రేమ..పెళ్లి కోసం ఇంట్లో ఎన్నో కష్టాలు.. మతాంతర వివాహంపై కీర్తి సురేశ్ క్లారిటీ!

తన నటన, అందం, అభినయంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.  వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్ తో తన 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం , మతాంతర వివాహం కోసం కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఎదురైన ఇబ్బందులను వెల్లడించింది. 

ప్లస్ టూ పూర్తి చేసిన వెంటనే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు  కీర్తి చెప్పింది.  కాలేజీ డేస్ లో తన వ్యక్తిగత డైరీని తల్లి మేనక చదవడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు. దాంట్లో తన ప్రేమకు సంబంధించిన విషయాలన్నీ రాసుకున్నట్లు చెప్పారు. తన తల్లి ఆ డైరీని చూసిన తర్వాత ఇక రాయడమే మానేశాను. ఎంతో ఇష్టంగా రాసుకున్న ఆ డైరీ ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. బహుశా దాన్ని తగలేసి ఉంటుందని సరదాగా చెప్పుకొచ్చింది కీర్తి.

ఇక ఆంటోనీతో పెళ్లి విషయంలోనూ కీర్తికి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. 2009 డిసెంబర్‌లో పరస్పర పరిచయం ఏర్పడగా, 2010 జనవరిలో ప్రేమ మొదలైంది. అప్పటికి కీర్తి వయసు 17 ఏళ్లు. ఆంటోనీ ఆమె కంటే ఏడేళ్లు పెద్దవారు. ఆయన క్రిస్టియన్ కావడంతో కుటుంబంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందరినీ ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని కీర్తి వెల్లడించారు.

ఆంటోనీ తనను హీరోయిన్‌గా మారకముందే చూశారని, ఇద్దరం కలిసి ఎదిగామని చెప్పుకొచ్చారు. ఆరేళ్లపాటు దూరంగా ఉంటూ సాగించిన లాంగ్ డిస్టెన్స్ ప్రేమ కూడా వారి బంధాన్ని మరింత బలపరిచింది. 2024 నవంబర్‌లో దీపావళి సందర్భంగా ప్రేమను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 12న గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 

తన ప్రేమకథలోని ఎన్నో మధురమైన, భావోద్వేగభరితమైన జ్ఞాపకాలను పంచుకోవడంతో కీర్తి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం కీర్తి సినిమాలతో ఓటీటీలోనూ రాణిస్తున్నారు. లేటెస్ట్ గా రాధికా ఆప్టేతో కలిసి నటించిన  క్రైమ్ థ్రిల్లర్ 'అక్క' నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది.