భారతీయ సినీ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యేలో నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చకు దారితీశారు. ఆమె వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులతో పాటు హీరోయిన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. లేటెస్ట్ గా'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు చిత్ర పరిశ్రమకు మద్దతుగా నిలిచారు. నటి రెజీనా కసాండ్రా గతంలో బాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టాలీవుడ్ తనకు గుర్తింపు, అవకాశాలు, ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిందని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నానని, తనను ఆదరించిన ఇండస్ట్రీకి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. కెరీర్‌కు పునాది వేసిన పరిశ్రమ నుంచే ఎన్నో ప్రయోజనాలు పొందిన తర్వాత దానిపై విమర్శలు చేయడం కృతజ్ఞత అనిపించుకోదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఆమె ఎక్కడా రాధికా ఆప్టే పేరును నేరుగా ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు..
మరోవైపు రెజీనా కసాండ్రా గతంలో హిందీ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దక్షిణాది నుంచి వచ్చిన నటిగా బాలీవుడ్లో కొన్ని సందర్భాల్లో తనను తక్కువగా చూసేవారని, మాటలతోనే కాకుండా వ్యవహారశైలితోనూ అవమానకరంగా ప్రవర్తించేవారని తెలిపారు. ఒకానొక సమయంలో ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించేందుకు కూడా కొంత సంకోచించానని చెప్పారు. 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా'తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రెజీనా, ఆ తర్వాత 'రాకెట్ బాయ్స్', 'ఫర్జీ', 'జాట్', 'కేసరి చాప్టర్ 2' వంటి ప్రాజెక్టులతో తన పరిధిని విస్తరించారు...
రాధికా ఆప్టే వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాంతీయత, నటీమణులకు దక్కుతున్న ప్రాధాన్యత, చిత్ర పరిశ్రమల్లో సమాన గౌరవం వంటి అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఒక పరిశ్రమలో ఎదురైన వ్యక్తిగత అనుభవాలను విమర్శించడం వేరు.. మొత్తం పరిశ్రమను తప్పుబట్టడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ వివాదం నార్త్, సౌత్ సినీ వర్గాల మధ్య ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది.
