యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ రెగ్యులేషన్స్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిబంధనలపై విచారణ జరిపింది. సమాజంలో విభజనలు సృష్టించేలా, ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అందరి ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు నొక్కిచెప్పింది.
ఇదివరకే యూజీసీ కొత్త రూల్స్ పై స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటి వరకు పాత యూజీసీ 2012 నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే ఈ కేసులో కేంద్రం తరపునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కుల వివక్ష నిర్మూలనకు తీసుకొచ్చిన UGC కొత్త రూల్స్ ను పునఃపరిశీలించేందకు కేంద్రం సిద్దంగా ఉందని కోర్టుకు తెలిపింది. ఆ రూల్స్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో సమీక్షా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మెహతా కోర్టుకు చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు పరరక్షిస్తామని, ఏ వర్గమూ వివక్షకు గురికాదని ఆయన హామీ ఇచ్చారు.
