ఈ వీకెండ్ సినీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనేలా కొత్త సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో తెలుగు డబ్బింగ్ చిత్రాలైన రామాయణ పార్ట్ 1, సీన్, మహాశక్తి, నాన్న కుట్టితో పాటు స్ట్రెయిట్ తెలుగు మూవీ సమ్మర్ హాలిడేస్ సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఐదు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. యాక్షన్, థ్రిల్లర్, ఫాంటసీ, రొమాన్స్ వంటి విభిన్న జోనర్లలలో స్ట్రీమింగ్ జి సిద్దమైన ఆ మూవీస్ ఏంటి? ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ కానున్నాయి? వాటి స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఏంటనేది ఓ లుక్కేద్దాం..
1. ఐ యామ్ గేమ్ (I'm Game)
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐ యామ్ గేమ్. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయాదు లోహర్, మైస్కిన్, ఆంటోనీ వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. డాన్ జాన్ అనే జూదగాడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బెట్టింగ్, డబ్బు, క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతడు అనూహ్య పరిణామాలతో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఆ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
2. ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఇది. భారతీయ పురాణాలు, జానపద కథలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రిషి అనే వ్యక్తి తన పూర్వీకుల గ్రామానికి తిరిగి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నిషేధిత అడవిలో దాగి ఉన్న పురాతన రహస్యాలు, భయంకరమైన శక్తులు అతడిని వెంటాడుతాయి. ఆ అడవి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనేది ఆసక్తికరంగా సాగుతుంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. అంటే చూడాలంటే ప్రత్యేకంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
3. హైవాన్ (Haiwaan)
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైవాన్. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనుంది. ఓ అపార్ట్మెంట్లో పనిచేసే చూపులేని వ్యక్తి అనుకోకుండా హత్య కేసులో చిక్కుకుంటాడు. అసలు హంతకుడు ఎవరు? ఈ కేసు నుంచి అతడు ఎలా బయటపడతాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ సాగుతుంది. నవంబర్ 6 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
4. నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil)
హరీష్ కల్యాణ్, సిద్ధి ఇద్నాని జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా నూరు కోడి వానవిల్. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరు యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమకు కుటుంబ పరిస్థితులు, అపార్థాలు ఎలాంటి అడ్డంకులుగా మారాయి? తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అనేదే కథాంశం. చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ మూవీ నవంబర్ 6 నుంచి జీ5లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అయితే పే-పర్-వ్యూ విధానంలో అందుబాటులోకి రానుండటంతో ప్రత్యేకంగా చెల్లించి చూడాల్సి ఉంటుంది.
5. మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2)
హిప్హాప్ తమిళ ఆదిత్య ప్రధాన పాత్రలో నటించిన తమిళ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ మీసయ మురుక్కు 2. 2017లో వచ్చిన మీసయ మురుక్కు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జీవా అనే యువకుడికి గానా సంగీతమంటే ఎంతో ఇష్టం. మ్యూజిక్ వరల్డ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటాడు. అయితే ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రేమ, కుటుంబ సమస్యలు అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే కథాంశం. సంగీతం, వినోదం, ఎమోషన్స్ కలగలిసిన ఈ మూవీ నవంబర్ 6 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఓవరాల్‌గా.. ఈ నవంబర్ 6 ఓటీటీ రిలీజ్‌లలో ప్రతి జానర్‌కు ఓ స్పెషల్ మూవీ రెడీగా ఉంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి హైవాన్, ఐ యామ్ గేమ్.. ఫాంటసీ, మిస్టరీ నచ్చేవారికి ది వాన్.. మ్యూజిక్, కామెడీ లవర్స్‌కు మీసయ మురుక్కు 2.. లవ్ అండ్ ఎమోషన్స్ కోరుకునేవారికి నూరు కోడి వానవిల్ మంచి ఆప్షన్స్‌గా నిలవనున్నాయి. మరి మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఏ మూవీ ఉండబోతోంది? అయితే కొన్ని సినిమాలకు రెంటల్, పే-పర్-వ్యూ ఛార్జీలు వర్తించవచ్చని గుర్తుంచుకోండి!
