మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 2026 నవంబర్ 5వ తేదీ రాత్రి ఓ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. 

అగ్ని ప్రమాదంతో మంటలు, పొగలు వ్యాపించడంతో స్థానికులు, పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అగ్నిప్రమాదం కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపడుతున్నారు..