January 12 Vidudala: కజకిస్థాన్‌లో వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మాస్ జాతర.. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!

January 12 Vidudala: కజకిస్థాన్‌లో వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మాస్ జాతర.. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!

విక్టరీ వెంకటేష్,  నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ మల్లీస్టారర్ మూవీ ' జనవరి 12 విడుదల (January 12 Vidudala) . ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ టీమ్ కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కలిసి పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీశ్ పర్యవేక్షణలో ఈ హై-వోల్టేజ్ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. కజకిస్థాన్‌లోని అద్భుతమైన పర్వత ప్రాంతాలను నేపథ్యంగా చేసుకుని భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలోనే ఇదొక ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ మేరకు కీలక అప్డేట్ తో కూడిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఇక యాక్షన్‌తో పాటు అభిమానులకు మరో స్పెషల్ ట్రీట్ కూడా సిద్ధమవుతోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి కనిపించే ప్రత్యేక పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించనున్నారు. అందమైన లొకేషన్లు, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించనుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్‌లో కజకిస్థాన్ పర్వత ప్రాంతాల మధ్య వెంకటేశ్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కలిసి కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. జీ.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి వెంకీ మామ, నందమూరి హీరో కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తారో చూడాలి..