Mohammed Shami: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దేశవాళీ క్రికెట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ.. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 23.5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 37 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 8 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. కేవలం 1.55 ఎకానమీతో షమీ బౌలింగ్ చేయడంతో టీమిండియా సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
షమీ బౌలింగ్కి వణికిన మహారాష్ట్ర బ్యాటర్లు:
* మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమీ వేసిన ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్ ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు.
* ఓపెనర్ పృథ్వీ షాను (12 రన్స్ ) బోల్తా కొట్టించిన షమీ.. ఆ తర్వాత సిద్ధేశ్ వీర్ (28), దిగ్విజయ్ పాటిల్ (డకౌట్), ప్రదీప్ ధాదేలను పెవిలియన్‌కు పంపి నాలుగు వికెట్లని దక్కించుకున్నాడు.
అద్భుతంగా ఆడినా బెంగాల్‌కు తప్పని ఓటమి:
* మహమ్మద్ షమీ అదరగొట్టినప్పటికీ.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ టీమ్ ఓడిపోయింది.
* తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ బెంగాల్ 143 పరుగులకే ఆలౌట్ కాగా, మహారాష్ట్ర 218 పరుగులు చేసి 75 పరుగుల ఆధిక్యం సాధించింది.
* రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 186 పరుగులకు ఆలౌట్ కావడంతో మహారాష్ట్ర ముందు కేవలం 112 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
* పృథ్వీ షా (53), సచిన్ ధాస్ (61) చెలరేగాడంతో మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో గెలిచింది.
వరుస మ్యాచ్‌ల్లో షమీ రికార్డు ప్రదర్శనలు:
ఈ సీజన్‌లో మహమ్మద్ షమీ కేవలం ఈ మ్యాచ్‌లోనే కాదు, అన్ని మ్యాచ్‌ల్లోనూ అదరగొడుతున్నాడు.
ఢిల్లీతో మ్యాచ్: తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీసి బెంగాల్‌కు విజయం అందించాడు.
కేరళతో మ్యాచ్: తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి బెంగాల్ భారీ విజయంలో (287 పరుగులు) కీలక పాత్ర పోషించాడు షమీ.
* దేశవాళీలో వరుసగా వికెట్లు తీస్తూ ఫిట్‌నెస్ నిరూపించుకుంటున్న షమీ.. భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఎప్పుడనే చర్చ క్రికెట్ వర్గాల్లో మరోసారి జోరుగా కొనసాగుతోంది. దీంతో షమీకి చోటు ఇవ్వాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ సుధీర్ఘంగా చర్చిస్తోంది.
