ప్రకాశం జిల్లాలో తీరానికి కొట్టుకొచ్చిన బోటులో నాలుగు మృతదేహాలు

ప్రకాశం జిల్లాలో తీరానికి కొట్టుకొచ్చిన బోటులో నాలుగు మృతదేహాలు

ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సముద్ర తీరానికి బోటు కొట్టుకరావడం కలకలం రేపింది. గురువారం (2026 నవంబర్ 5) కొట్టుకొచ్చిన పడవలో నాలుగు మృతదేహాలను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

ఈ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు మత్స్యకారులు. మురసు తుపాను ధాటికి తిరగబడిన మత్స్యకారుల పదవగా పోలీసులు భావిస్తున్నారు. తమిళనాడు కు చెందిన 15 మందితో కూడిన బోటు రెండు రోజుల క్రితం గల్లంతయింది. 

 కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం సముద్రంలో ప్రమాదవశాత్తు బోటు తిరగబడినట్లు సమాచారం. ఆ బోటు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. బోటులోని 15 మందిలో నలుగురు మృతదేహాలు మాత్రమే ఉండగా.. మిగతా 11 మంది ఆచూకీ ఏమయ్యుంటుందని విచారిస్తున్నారు. 

మురసు తుపాను సందర్భంగా అక్టోబర్ 29న చెన్నై నుంచి సముద్రంలోకి వెళ్లిన 4 మత్స్యకారుల బోట్లు.. సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఏపీ తీరం వెంబడి నిలిపి ఉంచినట్లు తెలిపారు. మూడు రాయపట్నం పోర్టులో, ఒకటి నిజాంపట్నం పోర్టులో ఉన్నట్లు తెలిపారు. 

అయితే నిజాంపట్నంలో లంగరు వేసి ఉన్న పడవలోని తొమ్మింది మంది ఏపీ లేదా తమిళనాడు అధికారులకు సమాచారం ఇవ్వకుండా.. రాయపట్నంలో ఉన్న తమ సహచరులను కలిసేందుకు బయల్దేరినట్లు ప్రకాశం జిల్లా  కలెక్టర్   పి. రాజాబాబు తెలిపారు. నవంబర్ 3న బయల్దేరిన బోటు ప్రమాదానికి గురై బోల్తా పడినట్లు చెప్పారు. 

నాలుగు మృతదేహాలను తమిళనాడుకు అప్పగిస్తామని చెప్పారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్లు తెలిపారు.