Rajinikanth Birthday: తలైవా కోసం రాఘవ లారెన్స్ మాస్టర్ ప్లాన్.. నెల రోజుల పాటు రజనీ బర్త్ డే సంబరాలు!

Rajinikanth Birthday: తలైవా కోసం రాఘవ లారెన్స్ మాస్టర్ ప్లాన్.. నెల రోజుల పాటు రజనీ బర్త్ డే సంబరాలు!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 812 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తలైవా విజయాన్ని అభిమానులు మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటిది ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే ఆ సందడే వేరు.  డిసెంబర్ 12న రజనీకాంత్ తన 76వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.

అయితే ఈ సారి తలైవా బర్త్ డే ( నవంబర్ 12 ) ను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.  ఏకంగా నెల రోజుల పాటు పండుగలా జరపబోతున్నారు.  నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించబోతున్నట్లు లేటెస్ట్ గా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.75 ఏళ్ల వయసులోనూ రజనీ ఇండస్ట్రీ హిట్ అందించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక నెల.. ఒక వేడుక.. ఒకే తలైవా అనే నినాదంతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ వేడుకలకు రజనీకాంత్‌ను స్వయంగా ఆహ్వానించి, ఆయన సమక్షంలోనే పుట్టినరోజు సంబరాలు నిర్వహించాలనేది తన కోరిక అని లారెన్స్ తెలిపారు. అయితే రజనీ నిరాడంబరమైన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానులే తమదైన శైలిలో ఈ వేడుకలను జరుపుకోనున్నట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి తాను ఆరాధించే తలైవా వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని, తన సినీ జీవితంలో సాధించిన విజయాలన్నీ ఆయనకే అంకితమని భావోద్వేగంగా పేర్కొన్నారు.

అయితే ఈ నెల రోజుల వేడుకల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఎక్కడ నిర్వహిస్తారు? అభిమానులు ఎలా పాల్గొనవచ్చు? అనే వివరాలను లారెన్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి ప్రణాళిక ప్రకటిస్తానని హింట్ ఇచ్చారు. మరి ఈసారి తలైవా బర్త్‌డే వేడుకలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలి. 30 రోజుల పాటు రజనీ మేనియా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చూడాలి.