Ramayana Review: రావణుడిగా యశ్ విధ్వంసం.. ‘రామాయణం’ రిజల్ట్‌పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

Ramayana Review: రావణుడిగా యశ్ విధ్వంసం.. ‘రామాయణం’ రిజల్ట్‌పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

నితేష్ తివారీ దర్శకత్వం వహించిన రామాయణం మొదటి భాగం.. ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ ప్రపంచవ్యాప్తంగా (నవంబర్ 5, 2026న) థియేటర్లలో విడుదలైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ భారీ ఎపిక్ ఫస్ట్ షోస్ విదేశాలల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రణ్‌బీర్ నటన, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్పై పలువురు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కించిన తీరు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. మరి ఓవరాల్గా ‘రామాయణ’ కథనం, భావోద్వేగాల విషయంలో ఆడియన్స్ ఎలా స్పందిస్తున్నారు అనేది ట్విట్టర్ టాక్లో తెలుసుకుందాం..

యశ్ రావణుడి మ్యాజిక్.. ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ఫిదా!

సినిమాలో యశ్ పాత్రకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కుతున్నాయి. రావణుడిగా ఆయన ఇంట్రడక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ రాముడిగా గ్రేస్‌ఫుల్‌గా, డివైన్‌గా కనిపించాడని, యశ్ రావణుడిగా ఫినామినల్‌గా ఉన్నాడని అంటున్నారు. ఇక సాయిపల్లవి నటనకు కూడా ప్రశంసలు లభించినప్పటికీ, రాముడు, సీత పాత్రల్లో ఆశించిన స్థాయిలో దైవత్వం, భావోద్వేగ గాఢత కనిపించలేదనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. 

సెకండాఫ్ నెక్స్ట్ లెవల్ అంటూ..

‘రామాయణ’ సినిమాపై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించారు. సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ఫస్ట్ హాఫ్ బాగుండగా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని పేర్కొన్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి కూడా తమ పాత్రల్లో చాలా బాగా నటించారని వెల్లడించారు. మొత్తంగా ‘రామాయణ’ ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తోందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ రివ్యూ సోషల్ మీడియాలో సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

విజువల్స్ అదుర్స్.. మ్యూజిక్ మైనస్!

భారీ VFX, గ్రాండ్ సెట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయని అంటున్నారు. కొన్ని విజువల్స్ ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ను గుర్తుచేస్తున్నాయని, అయితే కొన్ని చోట్ల CGI, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ నేచురల్‌గా అనిపించలేదనే విమర్శలున్నాయి. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కూడా అంచనాలను అందుకోలేకపోయిందని, ఆధ్యాత్మికత కంటే సూపర్‌హీరో మూవీ BGMలా అనిపించిందని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

సెకండాఫ్‌లో యాక్షన్ ఓవర్‌డోస్.. ఎండింగ్‌పై అసంతృప్తి!

సెకండాఫ్‌లో లెంగ్తీ యాక్షన్ సీక్వెన్స్‌లు రిపిటేటివ్‌గా అనిపించాయని, ఎమోషన్స్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని టాక్. క్లైమాక్స్‌లో కథనం కాస్త ఊపందుకున్నా, పార్ట్ 1 ముగింపు మాత్రం పూర్తి సంతృప్తినివ్వలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కీలక ఘట్టాలను సీక్వెల్ కోసం దాచేయడంతో, నెక్స్ట్ పార్ట్ కోసం మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సి రావడం డిసప్పాయింట్‌మెంట్‌గా మారిందని ఓ నెటిజన్ తన రివ్యూ రాసుకొచ్చాడు..