న్యూజిలాండ్తో రెండో వన్డే: జట్టులో హైదరాబాదీ డీఎస్పీకి చోటు.. భారత ప్లేయింగ్ XI ఇదే!

న్యూజిలాండ్తో రెండో వన్డే: జట్టులో హైదరాబాదీ డీఎస్పీకి చోటు.. భారత ప్లేయింగ్ XI ఇదే!

IND vs NZ 2nd ODI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో స్టార్ట్ చేసింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. శనివారం ( నవంబర్ 7న) నాడు వెల్లింగ్టన్ లోని హెన్రీ స్టేడియంలో జరగనున్న 2వ వన్డేలో గెలిచి సిరీస్‌లో ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని గిల్ సేన పక్కా ప్లాన్‌ వేసింది. కానీ, ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ స్టార్ పేసర్, డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) రీ-ఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్(Playing 11) ఇంట్రెస్టింగ్ గా మారింది. 

సిరాజ్ రీ-ఎంట్రీ.. ఆకిబ్ నబీపై వేటు: 

* న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా -ఏ తరఫున లింకన్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి వచ్చిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు తొలి వన్డేలో రెస్ట్ ఇచ్చారు. వెల్లింగ్టన్ వన్డేకు సిరాజ్ అందుబాటులోకి రావడంతో అతడికి తుది జట్టులో స్థానం దక్కడం ఖాయం అయింది. 

* తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (4/70), గర్నూర్ బ్రార్ (3/38), అన్షుల్ కాంబోజ్ (2/22)లు వికెట్లతో చెలరేగిపోవడంతో.. వికెట్ దక్కించుకోలేకపోయిన జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) పైనే వేటు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.  

ఫామ్‌లో విరాట్, బౌలింగ్ యూనిట్: 

తన 38వ పుట్టినరోజుకు ముందు రోజే 74 పరుగులతో కిరాక్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో భారత్‌ను మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మరోవైపు అన్షుల్ కాంబోజ్ కంట్రోల్డ్ బౌలింగ్, అర్ష్‌దీప్ సింగ్ పవర్‌ప్లే స్పెల్స్‌తో టీమిండియా బౌలింగ్ అటాక్ మరింత స్ట్రాంగ్ అయింది. 

భారత్ ప్లేయింగ్ XI అంచనా: 

రోహిత్ శర్మ, శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి / నమన్ ధీర్, మహమ్మద్ సిరాజ్/ ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్