ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ 2027: హార్దిక్‌తో పాటు ఆ బిగ్ స్టార్స్‌కు దండం పెట్టేసిన ముంబై!

ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ 2027: హార్దిక్‌తో పాటు ఆ బిగ్ స్టార్స్‌కు దండం పెట్టేసిన ముంబై!

Mumbai Indians Retention List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న మిని వేలానికి ముందే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మైండ్ బ్లాకింగ్ నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ నుంచి రోహిత్ శర్మ కమ్‌బ్యాక్ కెప్టెన్సీ వరకు.. ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, క్వింటన్ డికాక్ లాంటి రూ. కోట్ల విలువైన మ్యాచ్ విన్నర్లను వదిలేసేందుకు ముంబై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.   

పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబైకి అర్ష్‌దీప్: 

క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్తల ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ జట్టుకు ట్రేడ్ (Trade) చేసే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ప్రతిఫలంగా పంజాబ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్‌లను ముంబై దక్కించుకోవాలని చూస్తోంది. 

మళ్లీ కెప్టెన్ గా రోహిత్ శర్మ: 

హార్దిక్ పాండ్యా తప్పుకుంటే జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మకు మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉంది. ముంబై లెజెండ్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. రోహిత్ తిరిగి పూర్తిస్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.   

ట్రెంట్ బోల్ట్, చాహర్, డికాక్ ఔట్: 

సీనియర్ జర్నలిస్ట్ అమోల్ కర్హాద్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మిని వేలంలో రూ. 30 కోట్ల పర్స్ బ్యాలెన్స్‌తో ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు ముంబై ఇండియన్స్ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ని విడుదల చేయనుందన్నాడు. 

* ట్రెంట్ బోల్ట్ (Rs 12.50 Cr): గత సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 వికెట్లే తీసిన బోల్ట్‌ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది.  

* దీపక్ చాహర్ (Rs 9.25 Cr): భారీ ధరకు కొన్నా సరైన పర్ఫార్మెన్స్ చేయకపోవడంతో వదిలేసి.. వేలంలో మళ్లీ తక్కువ ధరకు (Price Correction) కొనుగోలు చేయాలనేది ముంబై ప్లాన్.   

* క్వింటన్ డికాక్ (Rs 1.00 Cr): మూడు మ్యాచ్‌ల్లో సెంచరీతో 132 పరుగులు చేసినప్పటికీ, పర్స్ సర్దుబాటు కోసం డికాక్‌ను విడుదల చేసేందుకు ఎంఐ సిద్ధమైంది. 

ముంబై ఇండియన్స్ రిటైన్‌డ్ ప్లేయర్స్ (Retained Players):

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కార్బిన్ బాష్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మహ్మద్ ఇజార్, అల్లా ఘజన్‌ఫర్.

ముంబై ఇండియన్స్ వదిలిపెట్టే ఆటగాళ్లు (Released Players):

హార్దిక్ పాండ్యా, క్వింటన్ డికాక్, దీపక్ చాహర్, రాబిన్ మింజ్, డానిష్ మలేవార్, రాజ్ బావా, మయాంక్ రావత్, క్రిష్ భగత్, ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, అశ్వనీ కుమార్, రఘు శర్మ, కేశవ్ మహరాజ్.