యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 44 రోజుల హుండీ లెక్కింపు పూర్తయింది. 2026 నవంబర్ 5న ఆలయ ఈవో పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో నరసన్న ఆదాయం 2 కోట్ల 60 లక్షల 59 వేల 278 రూపాయల నగదు వచ్చినట్లు తెలిపారు.
గత లెక్కింపుతో పోల్చితే నగదు ఆదాయం దాదాపు సమానంగా వచ్చినట్లు చెప్పారు. సెప్టెంబర్ లెక్కింపులో నగదు ఆదాయం 2 కోట్ల 59 లక్షల 3 వేల 628 రూపాయలు సమకూరింది.
ఈసారి నారసింహుడికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలు గతంతో పోల్చితే ఎక్కువగా వచ్చాయి. 65 గ్రాముల బంగారం వచ్చినట్లు పేర్కొన్నారు. గత సెప్టెంబరు లెక్కింపులో 32 గ్రాముల బంగారం వచ్చింది.
ఇక వెండి గతంతో పోల్చితే కాస్త తగ్గింది. 2 కిలోల 650 గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. సెప్టెంబరులో 3 కిలోల 950 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవీ జె. భవానీ శంకర్ పేర్కొన్నారు.
