నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం

హైదరాబాద్: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. గురువారం (నవంబర్ 5) ఆయన ప్రయాణిస్తోన్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. కట్టంగూరు మండలం అన్నారం స్టేజ్ దగ్గర ఈ ఘటన జరిగింది. వీరేశం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నకిరేకల్ నుంచి చినకాపర్తి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 

ఈ ఘటనలో వీరేశం కారు ధ్వంసమైంది. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వీరేశంను మరో కారులోకి తరలించారు. దీంతో వీరేశం కుటుంబ సభ్యులు, సిబ్బంది, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను క్షేమంగా ఉన్నానని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.