దివాళీ స్పెషల్: కిలో స్వీట్స్ లక్షా 11 వేలు.. బంగారం పూతతో తయారీ

దివాళీ స్పెషల్: కిలో స్వీట్స్ లక్షా 11 వేలు.. బంగారం పూతతో తయారీ

దీపావళి పండుగ వేళ బాణాసంచాతో పాటు స్వీట్లకు భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దివాళీ నాడు ప్రజలు స్వీట్లతో నోరు తీపి చేసుకుంటుంటారు. దివాళీ పండుగను పురస్కరించుకుని స్వీట్ షాప్ యాజమానులు రకరకాల మిఠాయిలు తయారు చేస్తుంటారు. స్వీట్ క్వాలిటీ, టేస్ట్‎ని బట్టి ధరలు ఉంటాయి. మా అంటే.. కిలో స్వీట్ల ధర మార్కెట్‎లో రూ.2 నుంచి 3 వేల వరకు ఉంటుంది. దివాళీ పండుగ డిమాండ్ ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ స్వీట్ల కిలో ధర వింటే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. 

ఎందుకంటే ఈ కిలో స్వీట్స్ ధర అక్షరాల లక్షా 11 వేలు. అవును మీరు విన్నది నిజమే. ఈ స్వీట్లు అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా.. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే.. ఈ స్వీట్లను బంగారు పూతతో తయారు చేస్తారు. మరీ ఈ హైకాస్ట్ స్వీట్ ను ఎవరూ తయారు చేస్తున్నారు.. ఎక్కడ చేస్తున్నారు తెలుసుకుందాం.. 

రాజస్థాన్ రాజధాని జైపూర్‎లోని వైశాలి నగర్‌ ఉన్న త్యోహార్ స్వీట్స్ షాపులో ఈ ప్రత్యేకమైన హైకాస్ట్ మిఠాయిని తయారు చేస్తున్నారు. ఈ స్వీట్ పేరు 'స్వర్ణ ప్రసాదం'. త్యోహార్ స్వీట్స్ వారి ఈ స్వర్ణ ప్రసాదం మిఠాయి తయారీలో ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌తో పాటు తినదగిన 24 క్యారెట్స్ బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఒక జైన దేవాలయం నుండి సేకరించిన 24-క్యారెట్ల బంగారు రేకును ఈ మిఠాయిపై అలంకరిస్తారు. దీనిలో పైన్ నట్స్ (చిల్‌గోజా), ప్రీమియం కుంకుమపువ్వును కూడా కలుపుతారు. ఈ మిఠాయిని కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. షాపు యజమాని ప్రకారం.. దివాళీ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. జైపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది. 

స్వర్ణ ప్రసాదం స్వీటే కాకుండా.. 'సిల్వర్ యాష్' అనే పేరుతో మరో మిఠాయిని కూడా తయారు చేశారు. దీని కిలో ధర రూ.75 వేలు. సిల్వర్ యాష్ స్వీట్ తయారీలో బాదం పప్పుును వాడతారు. ఈ స్వీట్‎పై వెండి రేకును అలంకరిస్తారు. ఇదే ఈ స్వీట్ స్పెషల్. సింగిల్ పీస్‎గా కూడా ఈ స్వీట్ ను విక్రయిస్తున్నారు. సింగల్ పీస్ కాస్ట్ రూ.1,550. ఇవే కాకుండా.. నవరత్న మిఠాయి, అషర్ఫీ మిఠాయి పేరుతో రకరకాల స్వీట్లను త్యోహార్ స్వీట్స్ వారు తయారు చేస్తున్నారు. 

స్వీట్లకు భారీ ధరలపై త్యోహార్ స్వీట్స్ వ్యవస్థాపకురాలు అంజలి జైన్ మాట్లాడుతూ.. చక్కెర, డ్రై ఫ్రూట్స్ ధరల పెరుగుదల స్వీట్ల రేట్ల పెంపుకు ప్రధాన కారణమని చెప్పారు. చక్కెర ధరల పెరుగుదల కంటే డ్రై ఫ్రూట్స్ ధరల పెరుగుదలే ఎక్కువ ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ఈ వ్యాపారాన్ని రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించామని.. కస్టమర్లకు కొత్త రుచులను పరిచయం చేస్తూ స్వీట్స్‌తో నిరంతరం ప్రయోగాలు చేస్తున్నామని ఆమె తెలిపారు.