ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రొనాల్డో గుడ్‌బై.. 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు

ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రొనాల్డో గుడ్‌బై.. 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు

Cristiano Ronaldo Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే చిరస్మరణీయమైన ఒక అధ్యాయం ముగిసింది. పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్, ఐదుసార్లు బ్యాలన్ డి’ఓర్ (Ballon d'Or) గ్రహీత క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ (International Football)కు వీడ్కోలు పలికాడు. సుమారు 23 ఏళ్ల పాటు పోర్చుగల్ జాతీయ జట్టుకు నంబర్-1 ప్లేయర్‌గా సేవలందించిన ఈ 41 ఏళ్ల సూపర్‌స్టార్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ వీడియో ద్వారా వెల్లడించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రొనాల్డో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. 

234 మ్యాచ్‌లు, 146 గోల్స్.. ఆల్‌టైమ్ రికార్డులు: 

*  క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ మైండ్ బ్లాకింగ్ రికార్డులతో నిండిపోయింది. ఇక పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున మొత్తం 234 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించాడు.

* పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రొనాల్డో సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.   

* దశాబ్ద కాలానికి పైగా పోర్చుగల్ జట్టుకు వెన్నెముకగా నిలిచి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించిన రోనాల్డో. 

పోర్చుగల్‌కు చారిత్రాత్మక ట్రోఫీలు:

* క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ జాతీయ జట్టు అంతర్జాతీయ వేదికపై చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది.

* యూరోపియన్ ఛాంపియన్‌షిప్ (2016): 2016లో జరిగిన ప్రతిష్టాత్మక యూరో కప్‌లో పోర్చుగల్‌ను విజేతగా నిలబెట్టడం రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.   

UEFA నేషన్స్ లీగ్ (2019): ఆ తర్వాత 2019లో జరిగిన యుఇఎఫ్‌ఎ నేషన్స్ లీగ్ టైటిల్‌ను కూడా పోర్చుగల్ ఖాతాలో వేసి నంబర్-1గా నిలిపాడు.   

క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్న ప్రయాణం: 

ఐదుసార్లు బ్యాలన్ డి’ఓర్ అవార్డులతో పాటు తన అద్భుతమైన స్పీడ్, గోల్ చేసే స్టామినా, కఠినమైన ఫిట్‌నెస్‌తో కోట్లాది మంది యువ ఆటగాళ్లకు రొనాల్డో ఒక ఐకాన్‌గా మారాడు. ఇకపై పోర్చుగల్ జెర్సీలో (National Duty) కనిపించకపోయినప్పటికీ.. సౌదీ అరేబియాకు చెందిన క్లబ్ 'అల్ నసర్' (Al Nassr) తరఫున క్లబ్ ఫుట్‌బాల్ ప్రయాణాన్ని రొనాల్డో కొనసాగించనున్నాడు.