RCB Retention List: ఐపీఎల్ 2027 (IPL 2027) మిని వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ తమ జట్టు వ్యూహాలపై స్పష్టమైన ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. టైటిల్ విన్నింగ్ కోర్‌ను కాపాడుకుంటూనే, జట్టు బ్యాలెన్స్ కోసం కొందరు ఆటగాళ్లను రిలీజ్ చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటిదార్‌లతో పాటు ప్రధాన బౌలర్లను రిటైన్ చేసుకోనున్న ఆర్సీబీ.. రొమారియో షెఫెర్డ్, నువాన్ తుషార లాంటి కీలక ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్సీబీ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు (Predicted Retained Core):
* ఆర్సీబీ జట్టు నిలకడను దెబ్బతీయకుండా ఉండేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్రధాన ఆటగాళ్లను కొనసాగించనుంది.
* బ్యాటింగ్ విభాగం: రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, ఫిలిప్ సాల్ట్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, జోర్డాన్ కాక్స్.
* ఆల్‌రౌండర్లు: కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, జాకబ్ బెథెల్.
* బౌలింగ్ విభాగం: జేమ్స్ హేజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, స్వప్నిల్ సింగ్, జాకబ్ డఫీ.
యంగ్ టాలెంట్: వికీ ఓస్ట్వాల్, సాత్విక్ దేశ్‌వాల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా.
బెంగళూరు వదిలేయబోతున్న ప్లేయర్లు (Predicted Released List):
ఐపీఎల్ మిని వేలంలో కొత్త బౌలింగ్ ఆప్షన్ల కోసం పర్స్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఆర్సీబీ కొందరిపై వేటు వేయబోతుంది.
* రొమారియో షెఫెర్డ్, నువాన్ తుషార: విదేశీ కోటా సర్దుబాటులో భాగంగా వీరిద్దరినీ రిలీజ్ చేయనున్నారు.
* యష్ దయాళ్: ఫిట్‌నెస్, లభ్యత ఆధారంగా యష్ దయాళ్‌ను వదిలేసే ఛాన్స్ ఉంది.
* మంగేష్ యాదవ్: రూ. 5.20 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, వేరొక వేరియేషన్ బౌలర్ కోసం ఇతడిని రిలీజ్ చేయవచ్చు.
* ఇతర ఆటగాళ్లు: రిచర్డ్ గ్లీసన్, అభినందన్ సింగ్.
* షెఫెర్డ్, దయాళ్, తుషారలను విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ సుమారు రూ. 8.10 కోట్ల పర్స్ బ్యాలెన్స్‌ని మరింత పెంచుకోనుంది.
