SS Rajamouli: 'రామాయణ' విజువల్స్ అద్భుతం.. యశ్, రణ్‌బీర్ నటనపై జక్కన్న ఏమన్నారంటే?

SS Rajamouli: 'రామాయణ' విజువల్స్ అద్భుతం.. యశ్, రణ్‌బీర్ నటనపై జక్కన్న ఏమన్నారంటే?

భారతీయ ఇతిహాసం రామయణాన్ని వెండితెరపై అద్భుత దృశ్యకావ్యంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైన 'రామాయణ: పార్ట్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  వేల కోట్ల అంచనాలు, భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ప్రపంచ వ్యాంప్తంగా ఈ రోజు ( నవంబర్ 5, 2026 )  థియేటర్లలోకి వచ్చిన చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటించారు. దీంతో  ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. 

నితీష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందిన 'రామాయణ'పై సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. లేటెస్ట్ గాదర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి  ఈ చిత్రాన్ని వీక్షించారు.  స్వయంగా సినిమాను ప్రశంసిస్తూ..  ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.  రామాయణం భారీ స్థాయి, వెండితెరపై కనిపించే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు

ముఖ్యంగా వనవాసం ఘట్టం నుంచి రాముడిగా రణ్‌బీర్ కపూర్ ప్రశాంతంగా కనిపిస్తూనే అద్భుతమైన గంభీరతను ప్రదర్శించారని రాజమౌళి ప్రశంసించారు. ఇక రావణుడిగా యశ్ తన భయానకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారని, సీతగా సాయిపల్లవి ఎంతో హుందాగా కనిపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను ఎంతగానో ఆస్వాదించానని తెలిపారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీతో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

 

ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస గాథలో మొదటి భాగం నవంబర్ 5న విడుదలైంది. రెండో భాగాన్ని 2028లో విడుదల చేయనున్నారు. మొత్తానికి జక్కన్న ప్రశంసలతో 'రామాయణ'పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..