మొహాలీ: ఇండియా మెన్స్ హాకీ జట్టు.. ఆరోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ఇండియా 4–1తో జపాన్‌పై గెలిచి వరుసగా మూడోసారి టైటిల్‌ను సాధించింది. మ్యాచ్ మూడో నిమిషంలోనే జపాన్ ప్లేయర్ కజుమసా మత్సుమోటో ఫీల్డ్ గోల్ చేసి ఇండియాకు షాకిచ్చాడు.
తొలి రెండు క్వార్టర్స్‌లో జపాన్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఇండియా ప్లేయర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఇండియా తరఫున శీలానంద్ లక్రా (42వ నిమిషం), దిల్‌ప్రీత్ సింగ్ (48వ ని), జుగ్‌రాజ్ సింగ్ (53వ ని), వివేక్ సాగర్ ప్రసాద్ (54వ ని) గోల్స్ చేశారు. గతంలో ఇండియా 2011, 2016, 2018, 2023, 2024లో టైటిల్స్‌ను అందుకుంది.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జపాన్‌కు 20వ నిమిషంలో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా.. కెప్టెన్ రైకీ పుజిషిమా కొట్టిన షాట్స్‌ను ఇండియా డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. మిడ్‌ఫీల్డ్‌లో వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్, డిఫెన్స్‌లో జర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా రాణించారు. 42వ నిమిషంలో ఇండియాకు రెండు పెనాల్టీలు లభించడం కలిసొచ్చింది.
