సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ లోకి ఖలీల్‌‌‌‌‌‌‌‌, ఎల్లిస్‌‌‌‌‌‌‌‌

సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ లోకి ఖలీల్‌‌‌‌‌‌‌‌, ఎల్లిస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–2027 వేలానికి ముందు సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీలు కీలక ప్లేయర్లను మార్పిడి చేసుకున్నాయి. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ లియామ్‌‌‌‌‌‌‌‌ లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌, జాక్‌‌‌‌‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి చెన్నై జట్టులోకి వెళ్లనున్నారు. వీళ్లకు బదులుగా సీఎస్కే నుంచి ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, నాథన్‌‌‌‌‌‌‌‌ ఎల్లిస్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌లోకి రానున్నారు. ఈ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 

రూ. 13 కోట్లకు ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌కు ఆడిన లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు రూ. 6 కోట్లకే సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఎడ్వర్డ్స్‌‌‌‌‌‌‌‌ ధర రూ. 3 కోట్లలో ఎలాంటి మార్పు లేదు. ఖలీల్‌‌‌‌‌‌‌‌ను సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ రూ. 4.8 కోట్లకు దక్కించుకుంది. 2018–21 మధ్య కాలంలో ఖలీల్‌‌‌‌‌‌‌‌కు సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌కు ఆడాడు. ఎల్లిస్‌‌‌‌‌‌‌‌ కోసం ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ రూ. 2 కోట్లు చెల్లించనుంది.