SIR అంశంపై పార్లమెంట్‌‌‌‌లో చర్చిద్దాం రండి..రాహుల్ గాంధీకి అమిత్ షా ప్రతి సవాల్

SIR అంశంపై పార్లమెంట్‌‌‌‌లో  చర్చిద్దాం రండి..రాహుల్ గాంధీకి అమిత్ షా ప్రతి సవాల్

న్యూఢిల్లీ/ కర్నాల్: ప్రధాని నరేంద్ర మోదీతో చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌‌‌‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. వీధుల్లో కాకుండా పార్లమెంట్‌‌‌‌లో చర్చకు రావాలని రాహుల్​కు సవాల్ విసిరారు. హర్యానాలోని కర్నాల్‌‌‌‌లో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అంశంపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయడానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ‘ప్రధానితో చర్చ జరగాలంటే ముందుగా లేఖ రాయండి. అంతేకాని వీధుల్లో అరాచకం సృష్టిస్తే బీజేపీ కార్యకర్తలు దీటైన బదులిస్తారు" అని హెచ్చరించారు. 2014, 2019, 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికలతోపాటు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎస్ఐఆర్ లేకపోయినా కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసిందని ఎద్దేవా చేశారు.