వైవిధ్యమైన కథలు, పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకున్న భూమి పెడ్నేకర్.. తాజాగా ఓ కొత్త సినిమాకు సైన్ చేసింది. ‘జానీ దుష్మన్ – డర్ కే ఆగే మౌత్ హై’ పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టీ సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రభలీన్ సంధు నిర్మిస్తున్నారు. అర్షద్ సయ్యద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదొక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. యూకేలో ఉంటున్న ఓ తల్లి, కూతురు నేపథ్యంలో అతీంద్రియ శక్తులు, కుటుంబ రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘ఫాస్ట్ & ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ, హ్యారీ పాటర్, ది ఎక్స్‌పెండబుల్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది కంజూరింగ్ లాంటి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన అంతర్జాతీయ స్టంట్ స్పెషలిస్ట్ పీటర్ పెడ్రెరో.. ఈ మూవీకి పనిచేస్తుండటం విశేషం.
ALSO READ : చందూ ఛాంపియన్ కాంబో రిపీట్..
హారర్ జానర్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో సెట్స్‌కు వెళ్లబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక హారర్ జానర్‌లో నటించడం భూమి పెడ్నేకర్‌కు కొత్తేమి కాదు. గతంలో ‘భాగమతి’ హిందీ రీమేక్ ‘దుర్గమతి: ది మిత్’లో ఆమె నటించింది.
Darr toh bahut dekha hoga, ab khauf mehsoos karne ke liye taiyaar ho jaaiye! Presenting Jaani Dushman – Darr Ke Aage Maut Hai! Starring Bhumi Satish Pednekkar, helmed by Arshad Syed and produced by Bhushan Kumar, Krishan Kumar, Prabhleen Sandhu and Ajay Singhal. Going on floors soon. Releasing in 2027! @bhumipednekar #BhushanKumar #KrishanKumar @PrabhleenSandhu #ArshadSyed @ShivChanana #RobbieGrewal @NeerajKalyan_24 @Tseries #TSeries @AlmightyMotion #JimEdgar #PeterPedrero #Bindni #JaaniDushman #JaaniDushmanDarrKeAageMautHai
— T-Series (@TSeries) November 4, 2026
