Raviteja: ఇరుముడి బ్లాక్‌బస్టర్ జోష్‌లో రవితేజ.. నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

Raviteja: ఇరుముడి బ్లాక్‌బస్టర్ జోష్‌లో రవితేజ.. నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ రూపంలో మంచి బ్లాక్‌బస్టర్ దక్కింది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఈ విజయం భారీ ఊరటనిచ్చింది. కెరీర్ పరంగా మంచి సక్సెస్‌తో పాటు తనపై ఉన్న అంచనాలను మరోసారి నిలబెట్టిన సినిమాగా ‘ఇరుముడి’ నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విజయాన్ని కంటిన్యూ చేయాలని భావిస్తున్న రవితేజ.. ఇకపై కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్టుపై రవితేజ ఫోకస్ పెట్టారు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ చేస్తున్న కొత్త సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. ఇది వీరిద్దరి తొలి కాంబినేషన్ కావడంతో సినిమాపై మొదటి నుంచే క్యూరియాసిటీ నెలకొంది. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు విభిన్నమైన కథలు, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ జరిగినట్లు సమాచారం. రవితేజతో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, మలయాళ నటి అనశ్వర రాజన్ ఈ ఫొటోషూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన రవితేజ షాడో లుక్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాకు అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

‘తులాభారం’.. టైటిల్ దాదాపు ఖరారేనా?

ఈ సినిమాకు ‘తులాభారం’ (Thulabharam) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దసరా సందర్భంగా సినిమాను అధికారికంగా లాంచ్ చేసి, టైటిల్‌తో పాటు పూర్తి కాస్ట్ అండ్ క్రూ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ : అగ్గిపెట్టె మచ్చ కిరణ్‌కు ఏమైంది? వెంటిలేటర్‌పై చికిత్స..

ఇక సినిమా జానర్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో వివేక్ ఆత్రేయ హారర్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన డిఫరెంట్ జానర్‌ను ప్రయత్నిస్తున్నట్లు కొన్ని రిపోర్టులు చెబుతుండగా, మరికొన్ని కథనాలు దీనిని హారర్-కామెడీ థ్రిల్లర్‌గా పేర్కొంటున్నాయి. అయితే జానర్‌పై కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రియాంక.. అనశ్వర.. జేడీ ?

ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించనున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో బలమైన టాక్ ఉంది. తాజాగా జరిగిన ఫొటోషూట్‌లో ఆమె పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అలాగే మలయాళ నటి అనశ్వర రాజన్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె హీరోయిన్‌గా నటిస్తారా? లేక కథలో కీలకమైన పాత్రను పోషిస్తారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. అంతేకాదు.. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని కూడా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కూడా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ సినిమా 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.