హైదరాబాద్ లోని HMDA ప్లాట్ల వేలానికి భారీ స్పందన వచ్చింది. శుక్రవారం ( నవంబర్ 20 )బాచుపల్లిలోని HMDA లేఔట్ కి ఈ ఆక్షన్ నిర్వహించగా భారీ స్పందన వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఈ ప్లాట్ల వేలం ద్వారా రూ.55.43 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు అధికారులు.
మొత్తం 50 రెసిడెన్షియల్ ప్లాట్లకు ఈ వేలం నిర్వహించామని... 50 ప్లాట్లలో 40 ప్లాట్లకు ఈ-వేలం విజయవంతం అయినట్లు తెలిపారు HMDA అధికారులు.
ఈ-వేలం విజయవంతం అయిన ప్లాట్లలో చదరపు గజానికి గరిష్ఠంగా రూ.60వేల 500 ధర పలికినట్లు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో చదరపు గజానికి రూ.49వేల 737గా వెయిటెడ్ యావరేజ్ ధర నమోదయ్యిందని తెలిపారు అధికారులు.ఈ వేలానికి గృహ కొనుగోలు దారులు, పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు అధికారులు.
