మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశంలో ఒక తార'. నవంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగాలు, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు వస్తున్న స్పందన చిత్రబృందంలో ఆనందాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా విజయంపై అల్లు అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు.. మేము ఈ సినిమాను నిజాయతీగా తీశాం. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మొదటి నుంచి ఉంది. అయితే మేము ఆశించిన దానికంటే ఏకంగా పది రెట్లు ఎక్కువ స్పందన వచ్చింది. ఇది నిజంగా ఊహించని అనుభూతిఅని అన్నారు.
అంతేకాదు, ప్రీమియర్స్ ప్రారంభమైనప్పటి నుంచి తనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయని అల్లు అరవింద్ వెల్లడించారు. రాత్రి ఒంటి గంట వరకు కూడా చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. కొందరైతే సినిమా చూసి ఏడుస్తూ కాల్ చేస్తున్నారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నాకు ఇదొక కొత్త అనుభవం. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆదరిస్తారా అని ఆశ్చర్యంగా ఉంది అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత స్వప్న గున్నం కష్టాన్ని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. అశ్వనీదత్‌తో ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసిన తనకు, స్వప్న ఆలోచనా విధానం ఎంతో నచ్చిందని చెప్పారు. ఈ విజయాన్ని ప్రేక్షకులకు అంకితం చేస్తూ త్వరలో మరో సక్సెస్ మీట్ నిర్వహిస్తామని ప్రకటించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. మరి ఈ సినిమా సాధిస్తున్న ప్రేక్షకాదరణ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి..
