టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో మరో అందమైన అధ్యాయం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ తన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అమ్మగా ప్రమోషన్ పొందారు. ప్రముఖ దర్శకుడు రాజో్ నిడిమోరుతో కలిసి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. నవంబర్ 20న ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు.
భావాద్వేగంతో...
తమ బిడ్డ చిన్నచిన్న వేళ్లను సమంత, రాజ్ ప్రేమగా పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. మా అందమైన బుజ్జిబాబు .. 'మా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ భావాద్వేగమైన క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు .. తమ ముద్దుల తనయుడికి 'దేవ్ నిడిమోరు'అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఒక్క ఫొటోతో సోషల్ మీడియా మొత్తం సందడి మైదలైంది.
'దేవ్' పేరు వెనుక ప్రత్యేకత..
అయితే బాబు పేరులోనూ ప్రత్యేకత ఉంది. సంస్కృత మూలాలున్న 'దేవ్' అనే పదానికి దేవుడు, దైవత్వం, పవిత్రత అనే అర్థాలు ఉన్నాయి. చిన్న పేరే అయినా ఎంతో గొప్ప అర్థాన్ని కలిగి ఉండటంతో అభిమానులు ఈ పేరును కూడా తెగ ఇష్టపడుతున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుణ్ ధావన్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ వంటి సెలబ్రిటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణం..
సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. భూత శుద్ధి వివాహ సంప్రదాయంలో జరిగిన వీరి పెళ్లి అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్టులతో వీరి పరిచయం మరింత బలపడింది. ఈ ఏడాది జూన్ 24న 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్లో సీమంతం వేడుకను కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంది.
మొత్తానికి.. సమంత జీవితంలో దేవ్ రాకతో ఆనందం రెట్టింపైంది. ఇక ఈ బుజ్జాయి ఫొటోలు, మధురమైన క్షణాలను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
