బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రామాయణ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1547. 15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో యష్ నటించిన 'కేజీఎఫ్ : చాప్టర్ 2' సాధించిన మొత్తం వసూళ్ల రికార్డును కూడా ఈ చిత్రం అధిగమించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నవంబర్ 19న (15వ రోజు) ఈ చిత్రం భారత్లో రూ. 19.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఐదు భాషల్లో కలిపి మొత్తం 21,437 షోల ద్వారా ఈ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్ రూ. 863.75 కోట్లుగా ఉంది. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 1,032.15 కోట్లకు చేరుకున్నాయి.
విదేశీ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. 15వ రోజు ఓవర్సీస్లో రూ. 5 కోట్లు వసూలు చేయడంతో, మొత్తం విదేశీ వసూళ్లు రూ. 515 కోట్లకు చేరాయి. 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ. 859.70 కోట్ల లైఫ్ టైమ్ కలెక్షన్స్ సాధించగా, 'రామాయణ' 15 రోజుల్లోనే ఆ మార్కును దాటి కొత్త మైలురాయిని చేరుకుంది.
14వ రోజు వచ్చిన రూ. 23.20 కోట్లతో పోలిస్తే... 15వ రోజు వసూళ్లలో 16.6 శాతం తక్కువగా నమోదయ్యాయి. రెండో వారంలో ఈ చిత్రం మొత్తం రూ. 299.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కాగా.. విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,500 కోట్ల మార్కును అందుకున్న తొలి భారతీయ చిత్రంగా 'రామాయణ' నిలిచింది. గతంలో 'ధురంధర్ 2' 15 రోజుల్లో ఈ ఘనత సాధించగా, ఆ రికార్డును ఈ సినిమా తిరగరాసింది.
ALSO READ : హాలీవుడ్ దిగ్గజాల సరసన షారుఖ్ ఖాన్..
ప్రస్తుతం ఈ చిత్రం అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సాధించిన సుమారు రూ. 1,742 కోట్ల వసూళ్ల రికార్డును లక్ష్యంగా పెట్టుకుంది. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యష్లతో పాటు సాయి పల్లవి (సీత), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు), లారా దత్తా (కైకేయి), అరుణ్ గోవిల్ (దశరథ మహారాజు) తదితరులు నటించారు. నవంబర్ 5, 2026న విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన రెండో భాగం 2028లో విడుదల కానుంది.
