రామ్ పోతినేని హీరోగా, దర్శకుడిగా ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నాడు. తన కెరీర్‌లో 23వ చిత్రం కాగా, ర్యాపో 23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ మేన్స్ డే సందర్భంగా గురువారం ప్రీ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో రామ్‌ను వెనుక వైపు నుంచి చూపించారు.
కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని రామ్ కనిపిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు మాస్, లవర్ బాయ్, యాక్షన్ హీరోగా విభిన్న పాత్రల్లో కనిపించిన రామ్.. ఈసారి మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఓ కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
అలాగే ‘ఎలోన్ వోల్ఫ్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌ను యాడ్ చేయడం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఒంటరిగా పోరాడుతూ, స్వతంత్రంగా ఆలోచించే ఓ వ్యక్తి ప్రయాణం చుట్టూ ఈ కథ సాగనుందని ట్యాగ్‌లైన్ ద్వారా హింట్ ఇచ్చారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ బ్రదర్ కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
